Header Banner

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. టూరిస్టులూ బీ అలర్ట్..!

  Sat Apr 26, 2025 15:33        India

ఇటీవల తిరుమలలో చిరుతల‌ సంచారం ఎక్కువైంది. రెండు వారాల కిందట కూడా చిరుత సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ కోసం టీటీడీ అధికారులు త‌క్ష‌ణ‌మే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చిరుతను పట్టుకునేందుకు తిరుపతి వేదిక్ విశ్వ‌విద్యాల‌యం వ‌ద్ద‌ ఓ బోన్‌ ఏర్పాటు చేశారు. అక్కడ చిరుత చిక్కింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి చిరుత కనిపించడంతో భ‌క్తులు భయాందోళనకు గుర‌వుతున్నారు. జూపార్క్‌ రోడ్డు నుంచి తిరుమల టోల్‌ గేటు మీదుగా చిరుత అటవీ ప్రాంతంలోకి వెళుతూ కనిపించింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

చిరుత సంచారం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. కాగా, చిరుతల పర్యవేక్షణకు ఒక ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయడానికి ఏపీ అటవీ శాఖ అధికారులు రెడీ అవుతున్నార‌ని తెలిసింది. శాటిలైట్‌, అధునాతన కెమెరాలు, జీపీఎస్‌ వంటి టెక్నాల‌జీ వ్యవస్థలతో చిరుతల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అటవీ మ్యూజియం ఉన్న భవనంలోనే ఈ సెల్‌ను ఏర్పాటు చేస్తార‌ని స‌మాచారం.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

 

నేడు (26/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #Booking